కేసిఆర్ చేసేదే చెప్తాడు – చెప్పింది చేస్తాడు

ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు…ఇప్పుడు చేస్తామంటే ఎట్లా నమ్ముతాం

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు లేవు

కాంగ్రెస్,బీజేపీ ల మోసపు మాటలు నమ్మి ఆగం కావొద్దు

కేసిఆర్ వచ్చిన తర్వాత ఈ 9 ఏళ్లలో జరిగిన అభివృద్ది,సంక్షేమ పథకాలతో వచ్చిన మార్పుపై గుండె మీద చేయి వేసుకొని ఆలోచన చేయాలి

కేసిఆర్ తోనే తెలంగాణ పదిలం..కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష

– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ:

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు అభివృద్ది పనుల శంకుస్ధాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ముందుగా బాల్కొండ మండలం బోదెపల్లి గ్రామంలో బోదెపల్లి అప్రోచ్ బిటి రోడ్ 1కోటి రూపాయలతో సింగిల్ లైన్ నుండి డబుల్ రోడ్ గా మార్చు పనుల శంకుస్థాపన,వన్నెల్ బి గ్రామంలో వన్నెల్ బి లింక్ రోడ్ టు వెంపల్లి రేంజర్ల న్యూ ఫార్మేషన్ రోడ్ 1కోటి వ్యయంతో చేపట్టే పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రేంజర్ల నుండి షెట్పల్లి వన్నెల్ బి వయా డంపింగ్ యార్డ్ న్యూ ఫార్మేషన్ రోడ్ 2.80 కోట్ల వ్యయంతో చేపట్టే పనుల శంకుస్థాపన,కొమురం భీమ్ విగ్రహ ఆవిష్కరణ,హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభోత్సవం,మహిళ బిల్డింగ్ ప్రారంభోత్సవం,సొసైటీ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రికి ఆయా మండలాల ప్రజలు మంగళ హారతులతో,డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. జై కేసిఆర్,జై ప్రశాంత్ అన్న,జై తెలంగాణ నినాదాలతో పార్టీ శ్రేణులు హోరెత్తించారు. మళ్ళీ విజయం మీదే అంటూ పలువురు మహిళలు బొట్టుపెట్టి ఆశీర్వదించారు.

ఈ సందర్బంగా మంత్రి వేముల మాట్లాడుతూ…

సీఎం కేసిఆర్ చేసేదే చెప్తాడు – చెప్పింది చేస్తాడు అని మంత్రి వేముల స్పష్టం చేశారు. అమలుకు నోచుకోని హామీలు కేసిఆర్ ఇవ్వడని,పేద ప్రజలకు అక్కరకు వచ్చే పనులు చేస్తాడని అన్నారు. రైతు బంధు,రైతు భీమా,కళ్యాణ లక్ష్మి,కేసిఆర్ కిట్,ఆసరా పెన్షన్లు,24 గంటల ఉచిత విద్యుత్,కుల వృత్తులకు ప్రోత్సాహం,సాగునీరు,సకాలంలో ఎరువులు ఇట్లా ఏ రంగం చూసుకున్నా కేసిఆర్ మానవీయ కోణంలో ఆలోచించి పథకాలు,అభివృద్ది పనులు చేశారని,దీంతో పేదలకు,రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. కెసిఆర్ కంటే గొప్పగా చేస్తామని ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు…ఇప్పుడు చేస్తామంటే ఎట్లా నమ్ముతామని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన 200 పెన్షన్ 2వేలు చేసింది కేసిఆర్ అని,కాంగ్రెస్ ఇప్పుడు 4వేలు ఇస్తామంటే ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 4వేల పెన్షన్ ఇచ్చి ఇక్కడ ప్రజలను ఓట్లు అడగాలన్నరు. వ్యవసాయానికి 3గంటల కరెంట్ చాలు అని రైతును మళ్ళీ గోసపెట్టే కార్యక్రమానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ది ఓర్వని బీజేపీ వాళ్ల పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. స్థానిక ఎంపి బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు రైతులను మోసం చేశాడని,తాను ఇవాళ పర్యటించిన గ్రామాల్లో ఆయన చేసిన అభివృద్ది ఏమిటని ప్రశ్నించారు. ఆయా గ్రామాల్లో చేసిన అభివృద్ది,ప్రభుత్వ సంక్షేమ పథకాలు ద్వారా జరిగిన లబ్దిని గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు. కాంగ్రెస్,బీజేపీ ల మోసపు మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని కోరారు. కేసిఆర్ వచ్చిన తర్వాత ఈ 9 ఏళ్లలో జరిగిన అభివృద్ది,సంక్షేమ పథకాలతో వచ్చిన మార్పుపై గుండె మీద చేయి వేసుకొని ఆలోచన చేయాలని కోరారు. కేసిఆర్ తోనే తెలంగాణ పదిలంగా ఉంటుందని,కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మంత్రి వేముల మరోసారి పునరుద్ఘాటించారు.