కేసీఆర్‌కు బాధ్యత లేదా?.. సభకు ఎందుకు రాడు?
` కృష్ణా జలాలపై ఆయన మాట్లాడగానే మేం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాం
` 299 టీఎంసీలకు చాలని కేసీఆర్ చేసిన సంతకం తెలంగాణకు మరణశాసనం
` పార్టీ కార్యాలయాల్లో ఇష్టారీతిన మాట్లాడితే ప్రజల్లో గందరగోళం నెలకొంటుంది
` పాలమూరును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి తీరని అన్యాయం చేశారు
` సభల్లో మాట్లాడినదానికంటే.. అసెంబ్లీలో మాట్లాడే మాటలకు విలువ ఉంటుంది
` 299 టీఎంసీలకు చాలని కేసీఆర్ చేసిన సంతకం తెలంగాణకు మరణశాసనం
` పాలమూరును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి తీరని అన్యాయం చేశారు
` ఎంతో అనుభవం ఉన్న కేసీఆర్ సభకు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారనుకున్నా
` రెండేళ్లుగా ఆయన సభకు రాకపోవడం విచారకరం.
` నాడు పార్టీ కంటే.. నా ప్రాంతమే ముఖ్యమని బయటికొచ్చా
` అసెంబ్లీలో ‘నీళ్లు`నిజాలు’పై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): కృష్ణానది ప్రాజెక్టులపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శాసనసభలో ‘నీళ్లు`నిజాలు’పై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా సీఎం మాట్లాడారు.‘‘ఉమ్మడి రాష్ట్రంలో, గత పదేళ్లలోనూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు అన్యాయం జరిగింది. ఎంతో అనుభవం ఉన్న మాజీ సీఎం సభకు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారనుకున్నా. కేసీఆర్.. నదీ జలాల గురించి మాట్లాడితే రాష్ట్రానికి ఉపయోగపడే సలహాలు చెప్తారనుకున్నా. సభల్లో మాట్లాడినదానికంటే.. అసెంబ్లీలో మాట్లాడే మాటలకు విలువ ఉంటుంది. రెండేళ్లుగా ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోవటం విచారకరం. గతంలో భారత రాష్ట్ర సమితి నేతలు అవమానించినా.. కాంగ్రెస్ నేతలు సభకు వచ్చి మాట్లాడేవారు. ప్రతిపక్ష నేతలు అసెంబ్లీలో మాట్లాడకుంటే .. అంతిమంగా ప్రజలకే అన్యాయం జరుగుతుంది. కృష్ణా జలాలపై చర్చను తెరపైకి తెచ్చిందే ప్రతిపక్ష నేత కేసీఆర్. పార్టీ కార్యాలయాల్లో మాట్లాడితే ప్రజల్లో గందరగోళం నెలకొంటుంది. అందుకే కేసీఆర్ మాట్లాడిన వెంటనే అసెంబ్లీలో చర్చ చేపట్టాం. కానీ, ఆయన మాత్రం సభకు రాలేదు. చట్టసభలంటే వారికి చిన్న చూపు’’ అని సీఎం అన్నారు.
‘‘కృష్ణా జలాలపై చర్చను తెరపైకి తెచ్చిందే ప్రతిపక్ష నేత’’
పేదరికం, నీటి కరవును ప్రత్యక్షంగా చూశానని సీఎం రేవంత్ అన్నారు. ‘‘కృష్ణా నదీ ప్రాజెక్టులపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఎంతో అనుభవం ఉన్న కేసీఆర్ సభకు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారనుకున్నా. రెండేళ్లుగా ఆయన సభకు రాకపోవడం విచారకరం. కృష్ణా జలాలపై చర్చను తెరపైకి తెచ్చిందే ప్రతిపక్ష నేత. పార్టీ కార్యాలయాల్లో మాట్లాడితే ప్రజల్లో గందరగోళం నెలకొంటుంది. అందుకే, కేసీఆర్ మాట్లాడగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాం’’ అని రేవంత్ అన్నారు.
‘‘నాడు పార్టీ కంటే.. నా ప్రాంతమే ముఖ్యమని బయటికొచ్చా’’
హైదరాబాద్: ‘‘నాకు నా ప్రాంతమే ముఖ్యం. ఆ తర్వాతే పార్టీ అని నాడు బయటకొచ్చా. సీఎం కుర్చీలో ఉండి తెలంగాణకు అన్యాయం జరిగేలా ప్రవర్తించను. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపిన చరిత్ర నాది. దానిని ఆపితేనే చర్చలకు వస్తామని కండీషన్ పెట్టాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిందో లేదో.. నిజనిర్ధారణ కమిటీ ద్వారా విచారణ చేయించుకోవచ్చు’’ అని తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు.
సమైక్య రాష్ట్రం కంటే బీఆర్‌ఎస్ హయాంలోనే జలదోపిడీ
‘కాళేశ్వరానికి’ ప్రాధాన్యమిచ్చి ‘పాలమూరు’ను పక్కకు పెట్టారు
` కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం చేసింది బీఆర్‌ఎస్ పెద్దలే..
` ఏపీ జలాలు తరలిస్తుంటే గత పాలకులు చూస్తూ కూర్చున్నారు
` పాలమూరు ` రంగారెడ్డి ఎత్తిపోతల మోటార్‌ను కేసీఆర్ ఆన్ చేసిన తెల్లారే.. ఆఫ్ చేశారు
` ప్రాజెక్టుపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):పాలమూరు ` రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కేవలం 30 శాతం నిధులు మాత్రమే ఖర్చు పెట్టారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చలో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. పాలమూరు ` రంగారెడ్డి ప్రాజెక్టుకు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం 2015లో జీవో ఇచ్చి 2022లో డీపీఆర్ సమర్పించిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం పెట్టిన శ్రద్ధ పాలమూరు ప్రాజెక్టుపై పెట్టలేదని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు వాటర్ సోర్సును మార్చడం వల్ల తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు.
‘‘కాళేశ్వరంపై రూ.90వేల కోట్లు ఖర్చు చేసినవారు.. పాలమూరుకు రూ.27 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. పాలమూరు ప్రాజెక్టులో ఒక మోటార్ ఆన్ చేసి జాతికి అంకితం చేశామని ప్రకటించారు. కేసీఆర్ మోటార్ ఆన్ చేసిన తెల్లారే.. మళ్లీ ఆఫ్ చేశారు. కృష్ణా నది ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. గత ప్రభుత్వం రూ. 40 వేల కోట్ల బిల్లులు పెండిరగ్ పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి.. పాలమూరును నిర్లక్ష్యం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించేలా అంచనాలు పెంచుకుంటూ పోయారు. పాలమూరులో మాత్రం 1.5 నుంచి ఒక టీఎంసీకి తగ్గించారు. జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీలు తరలించే అవకాశం ఉండేది. 60 రోజుల్లో 121 టీఎంసీలు తీసుకునేవాళ్లం. వాటర్ సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల 68 టీఎంసీల స్థాయికి పడిపోయింది. ఆయకట్టు కాల్వల ప్రస్తావన, భూసేకరణ లేకుండానే డీపీఆర్ రూపొందించారు. ప్రాణహిత ` చేవెళ్లను తుమ్మిడిహట్టి నుంచి మార్చి గోదావరిలో అన్యాయం చేశారు. జూరాల నుంచి అయితే 22 పంపుల ఏర్పాటుతో ప్రాజెక్టు పూర్తయ్యేది. 414 విూటర్ల లోతు నుంచి నీరు తీసుకొనేవాళ్లం. శ్రీశైలానికి మార్చడం వల్ల పంపుల సంఖ్య 37కి పెరిగింది. దాదాపు 560 విూటర్ల లోతు నుంచి నీటిని ఎత్తిపోయాల్సిన పరిస్థితి వచ్చింది’’ అని ఉత్తమ్ వివరించారు.
ఏపీ తరలిస్తుంటే చూస్తూ కూర్చున్నారు..
‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అక్రమంగా నీరు తరలిస్తుంటే బీఆర్‌ఎస్ సర్కారు చూస్తూ కూర్చుంది. ఏపీ ప్రభుత్వం రోజుకు 13 టీఎంసీలు తరలించుకుపోయేలా ప్రాజెక్టును విస్తరించింది. జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలు ప్రాజెక్టు నిర్మిస్తుంటే బీఆర్‌ఎస్ కనీసం అభ్యంతరం చెప్పలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయలసీమ ఎత్తిపోతలపై కేంద్రానికి ఫిర్యాదు చేశాం. పనులు నిలిపివేయించాం. 2024`25 సీజన్‌లో కృష్ణా జలాల్లో ఎక్కువ నీటిని వాడుకున్నాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలకు అంగీకరించి కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారు. కృష్ణా నదీ పరివాహకం ప్రకారం మనకు అధిక వాటా రావాల్సి ఉంది. మేం వచ్చాక 550 టీఎంసీలు కావాలని వాదించాం. పాలమూరు ` రంగారెడ్డి ప్రాజెక్టు కింద ఇంకా 39 వేల ఎకరాల భూ సేకరణ పెండిరగ్‌లో ఉంది’’ అని ఉత్తమ్ తెలిపారు.
కరువు జిల్లా పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు..
పాలమూరు రంగారెడ్డికి సత్వర అనుమతులు ఇవ్వాలి
` జలవివాదాలు పరిష్కారం అయ్యేవరకు బనకచర్ల, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దు
` శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తీవ్ర కరువు ప్రాంతం, అత్యదిక వలసలకు గురైనటువంటి ప్రాంతం.. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, నాటి ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (పీఆర్‌ఎల్‌ఐఎస్)ను చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత గత పదేళ్ళలో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సరిjైున రీతిలో పురోగతి లేకపోవడం వల్ల ప్రాజెక్టు అంచనాలు, నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని పరిగణలోకి తీసుకొని ఈ శాసనసభ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (90 టిం.ఎం.సిలతో త్రాగునీటి, సాగునీటి కొరకు) సంబంధించిన అన్ని అనుమతులను సత్వరమే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఎకగ్రీవంగా తీర్మానించారు. ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జల వివాదాలన్నీ పరిష్కరించే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టబోతున్న పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు/పోలవరం నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు లేదా మరే ఏ ఇతర రూపంలోనైనా గోదావరి జలాలను తరలించెందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు.


