కేసీఆర్‌ను చర్చలకు పిలిచింది కాంగ్రెస్సే: పాల్వాయి
న్యూడిల్లీ: తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును తెలంగాణపై చర్చించేందుకు డిల్లీకి రావాలని పిలిచింది కాంగ్రెస్ పార్టీనేనని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు టిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు డిల్లీకి వచ్చారని, అధిష్టానం పిలుపు మేరకే ఆయన డిల్లీ వచ్చి కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరపారని వెల్లడించారు. కేసిఆర్‌ను కాంగ్రెస్ చర్చలకు ఆహ్వనించలేదని పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వాయలార్ రవి పొరపాటున అని ఉంటారని చెప్పారు.