కేసీఆర్‌పై ఖమ్మం కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలు

ఖమ్మం జిల్లా: తెరాస అధినేత కేసీఆర్‌పై ఖమ్మం జిల్లా కోర్టులో ప్రైవేటు పిటిషరన్‌ దాఖలైంది. కేసీఆర్‌ రాజ్యాంగాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని రామారావు అనే న్యాయవాది ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. కేసీఆర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు నివేదిక అందజేయాలని న్యాయమూర్తి అధికారులను అదేశించారు.