కేసీఆర్‌పై మండిపడ్డా ఎర్రబెల్లి

వరంగల్‌: తెరాస అధినేత కేసీఆర్‌పై తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. బయ్యారం, ఓబుళాపురం, పోలవరం విషయంలో తెరాస అధినేత కేసీఆర్‌కు పెద్దఎత్తున ముడుపులు ముట్టాయని ఆరోపణలు చేశారు. తెరాస వసూళ్లపై ఆధారాలు ఉన్నాయని.. కేసీఆర్‌ చర్చకు వస్తే నిరూపించేందుకు సిద్ధమని ఆయన వరంగల్‌లో సవాలు విసిరారు. బయ్యారం గనుల విషయంలో కేసీఆర్‌ ఒక్కరోజు పోరాటం చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. బయ్యారం గనులు తెలంగాణ ఆస్తి అని.. ఇనుప ఖనిజం తరలింపును అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ ఉనికి కోసం బయ్యారం గనులపై తెరాస డ్రామా ఆండుతోందని మండిపడ్డారు. తెరాసకు దమ్ముంటే సీఎం ఇంటి ఎదుట, పార్లమెంట్‌లో ధర్నా చేయాలని హితవు పలికారు. కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంట్‌ను అమ్ముకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.