కేసీఆర్ వలసలకే ప్రాధాన్యమిస్తున్నారు: తెదేపా నేత పెద్దిరెడ్డి
హైదరాబాద్ : తెరాస నేత కేసీఆర్ ప్రాంతీయ వాదానికంటే వలసలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని తెదేపా నేత పెద్దిరెడ్డి అన్నారు. ఉద్యమానికి ప్రజలు కావాలి, టికెట్లకు ఇతర పార్టీల నేతలు కావాలి… ఉద్యమస్ఫూర్తి అంటే ఇదేనా అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ నిజంగా తెలంగాణ కోరుకుంటే తెదేపాతో కలిసి రావాలని పెద్దిరెడ్డి అన్నారు.