కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం
భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన, బీజేవైఎం జిల్లా కోశాధికారి పానగంటి మహేష్ గౌడ్ మాట్లాడుతూ వేలాదిమంది యువకుల, విద్యార్థుల, ఉద్యోగుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో మద్యం వ్యాపారానికి తాకట్టు పెట్టిన కల్వకుంట్ల కుటుంబానికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేశారు.
కేటీఆర్ మునుగోడు పర్యటన లో అడ్డుకుంటారనే నేపంతో బీజేవైఎం మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్ ని తెల్లవారుజామున అరెస్ట్ చేయడం సరి కాదన్నారు. దీనిని బీజేవైఎం జిల్లా కమిటీ తీవ్రంగా కండిస్తుందనిన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు కమిశేట్టి శ్రీనివాస్ , మేకల శ్రీకాంత్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శిలు మట్టిపల్లి శ్రీశైలం, సింగరపు గిరి, వేముల రంజిత్, నాంపల్లి శివ, ముద్దిగొండ సైదులు, జెట్టగొని శేఖర్, వట్టికొట్టి మహేష్, పొలగోని జగన్, తదితరులు పాల్గొన్నారు.