కేసీఆర్ పుట్టింటి కానుక బతుకమ్మ చీరెలు
మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్
సూర్యాపేట టౌన్ ( జనంసాక్షి): రాష్ట్రంలోని ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరెలను సీఎం కేసీఆర్ పుట్టింటి కానుకగా అందిస్తున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో బతుకమ్మ చీరెలను పంపిణి చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతోనే బతుకమ్మ పండుగక గుర్తింపు వచ్చిందన్నారు.ఈ గుర్తింపునకు స్ఫూర్తిగా బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరెలు పంపిణి చేస్తున్నట్లు చెప్పారు.రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో 36,498 మంది మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ -ఛైర్పర్సన్ పుట్టా కిషోర్ , మున్సిపల్ కమీషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి , మెప్మా పిడి రమేష్ నాయక్ , వివిధ వార్డుల కౌన్సిలర్లు ఎడ్ల గంగా భవాని, బచ్చలకూరి శ్రీను, వేముల కొండపద్మ , పగిళ్ల సుమిలా రెడ్డి, సలిగంటి సరిత వీరేంద్ర , మడిపల్లి విక్రమ్ ,
కొండపల్లి భద్రమ్మ , కక్కిరేణి శ్రీనివాస్, బైరు శైలేందర్, కో -ఆప్సన్ సభ్యురాలు పెద్దపంగ స్వరూప రాణి , 34వ వార్డ్ అధికారి ఎస్ఎస్ఆర్ ప్రసాద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.