కేసులు ఎత్తివేయాలని టీ ఉద్యోగుల ధర్నా
హైదరాబాద్: ఉద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యోగులపై నమోదుచేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని పదవ పీఆర్సీనీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని పది జిల్లాల కలెక్టరేట్ల ముందు తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు భైటాయించి ధర్నాకు దిగి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు. సచివాలయం ఎదుట ధర్నాలో పాల్గొన్న దేవిప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కాలంలో నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని పదవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యోగుల సమస్యల పట్ల సీమాంధ్ర సర్కారు నిర్లక్ష్యం వహిస్తుందని వెంటనే ప్రభుత్వం కేసులను ఎత్తివేసి పదవ పీఆర్సీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.