కేసుల విచారణలో వేగం పెరగాలి
కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వెల్లడి
న్యూఢిల్లీ : న్యాయస్థానాల్లో కేసుల విచారణలో వేగం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. ఆస్ట్రేలియా సంస్థ వైట్ ఇండస్ట్రీస్‌కు, భారత్ ప్రభుత్వ సంస్థ కోల్ ఇండియాకు మధ్య తలెత్తిన వివాదం గురించి ఆయన ప్రస్తావించారు. ఈ విషయంలో భారత సుప్రీం కోర్టు వేగంగా స్పందించకపోవడంతో అంతర్జాతీయ ట్రైబ్యునల్‌లో కోల్ ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. కేసు విచారణలో అసాధారణ జాప్యాన్ని ట్రైబ్యునల్ తప్పపట్టింది. సల్మాన్ ఖుర్షీద్ శనివారం ‘అసోచామ్’ సదస్సులో మాట్లాడారు. భారత న్యాయ వ్యవస్థ పట్ల తనకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. కోర్టులు తమ కక్షదారులందరి పట్ల సమానంగా వ్యవహరిస్తాయని స్పష్టం చేశారు. అయితే తుది తీర్పులను వెలువరించడంలో జాప్యం జరగరాదని అభిప్రాయపడ్డారు. కొన్ని కేస్లుఓ్ల సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోవడమే అతిపెద్ద సమస్య అని అన్నారు.ఉత్తరప్రదేశ్‌లో బొగ్గు గనుల అభివృద్ధి కోసం 1989లో వైట్ ఇండస్ట్రీస్ ఆస్ట్రేలియా లిమిటెడ్, కోల్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. కొంతకాలానికి రెండు సంస్థల మధ్య పలు వివాదాలు తలెత్తాయి. ఈ వ్యవహారం 2006లో భారత సుప్రీంకోర్టు ప్రకటించకపోవడంతో ఆస్ట్రేలియా సంస్థ ఐక్యరాజ్య సమితి ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది.