కేసు పురోగతిలో ఉంది నిందితుల్ని పట్టుకుంటాం : సబిత

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(టన్శసలక్ఞ్ష):
దిల్‌సుక్‌నగర్‌ జంట బాంబుపేలుళ్ల ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమం హహ్యంది. ఓ వైపు నిందితలను పట్టుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు నిఘాను తీవ్రం చేసింది. అలాగే భవిష్యత్‌ఓల ఇలాంటి ఘటనలు పునావృతం కాకుండా గట్టి బందోబస్తు చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్ల దుర్ఘటనలో కొంత ఫుటేజి దొరికినా నిఘా నేత్రాలు మరింత బలపడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ముందు నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠపరచడానికి వీలుగా అత్యాధునిక సి.సి. కెమేరాలను పోలీసు వ్యవస్థకోసం సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. హైదరాబాద్‌ నగరంలో మొత్తం 3500 కెమేరాలు అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలల వ్యవధిలోనే ఈ కెమేరాలను అన్ని ముఖ్యమైన కూడళ్లలోనూ, సున్నితమైన ప్రాంతాలలోనూ అమర్చనున్నట్టు రాష్ట్ర ¬ంశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు. మొత్తం 450 కోట్లతో హైదరాబాద్‌లో అత్యాధునిక సి.సి. కెమేరాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి అంగీకరించారని ¬ం మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్ల దుర్ఘటనలో నిఘా వ్యవస్థ వైఫల్యం ఏవిూ లేదని ఆమె చెప్పారు. బాంబు పేలుళ్లకు పాల్పడి అమాయకుల ప్రాణాలు బలిగొన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని ఆమె తెలియజేశారు. సినిమా హాళ్లు, మాల్స్‌, ఆస్పత్రులలోనూ, ఇంకా ఇతర ముఖ్యమైన ప్రాంతాలలోనూ సి.సి. కెమేరాల ఏర్పాటు తప్పనిసరి చేస్తూ త్వరలో చట్టం కూడా చేయనున్నట్టు ఆమె వెల్లడించారు. పేలుళ్లకు పాల్పడిన వారిని పట్టుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దిల్‌సుక్‌నగర్‌ పేలుళ్లపై సచివాలయంలో సిఎం సమక్షంలో జరిగిన సవిూక్షా సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ దర్యాప్తు కోసం 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు ఆమె తెలిపారు. నగరంలో 3500 సీసీ కెమెరాలను ఆరునెలల్లో ఏర్పాటుచేస్తామన్నారు. కొత్తగా భవనాలు నిర్మించేముందు సీసీ కెమెరాలు ఏర్పాటుచేసేలా చట్టంలో మార్పులు తీసుకురానున్నట్టు ఆమె తెలిపారు. దిల్‌షుక్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల ఘటన కేసును త్వరలోనే ఛేదిస్తామని, పేలుళ్లకు పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని సబిత ధీమా వ్యక్తం చేశారు.ఈ పేలుళ్లలో గాయపడినవారందరికీ మంచి వైద్యం అందిస్తున్నామని ¬ం మంత్రి తెలియజేశారు. వైద్యులు అన్ని రకాలుగా గాయపడినవారికి చికిత్స చేస్తున్నారని ఆమె చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించడానికి ప్రభుత్వం వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ఆమె తెలియజేశారు. అంతకుయుందు దిల్‌షుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లపై ఉన్నతాధికారులతో ¬మంత్రి సబితా ఇంద్రారెడ్డి సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఘటనకు సంబంధించిన పలు అంశాలపై ఆమె అధికారులతో చర్చించారు.
విచారణకు 15 ప్రత్యేక బృందాలు
బాంబు పేలుడు ఘటనను విచారించేందుకు పదిహేను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ¬ంమంత్రి తెలిపారు. ఒక్కో బృందంలో పది నుంచి పదిహేను మంది పోలీసులు ఉంటారని ఆమె వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారని ఆమె చెప్పారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారి వివరాలు ఎవరి-కై-నా తెలిస్తే తమకు తెలపాలని ఆమె కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని వారికి పది లక్షల రూపాయల నజరానా కూడా ఇస్తామని ప్రకటించారు.దిల్‌షుఖ్‌నగర్‌లో ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై నివేదిక తెప్పించుకుంటున్నామని, నివేదిక వచ్చాక వివరాలు తెలియజేస్తామని స్పష్టం చేశారు.