కొంగగట్టులో దీక్షపరుల మధ్య తోపులాట
కరీంనగర్, జనంసాక్షి: మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో ఈ ఉదయం కల్యాణకట్ట వద్ద దీక్షాపరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో బారికేడ్లు కూలిపోయాయి. వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆలయంలో భక్తులకు తగ్గట్లు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపించారు.