కొండగట్టుకు పోటెత్తిన భక్తులు….

కరీంనగర్‌:కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. చంద్రగ్రహణం కారణంగా నిన్న ఆలయాన్ని మూసేసిన అధికారులు ఈ తెల్లవారుజామున మూడు గంటలకు తెరిచి దర్శనానికి భక్తులను అనుమతించారు. దీంతో హనుమాన్‌ మాలధారులు పెద్ద ఎత్తున చేరుకుని మాల విరమణ చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసి పోయాయి.