కొండగట్లు హన్మాన్ టెంపుల్‌లో భక్తుల కిటకిట
కరీంనగర్, (జనంసాక్షి): హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగణలోకి పవిత్ర పుణ్యక్షేత్రం కొంగట్టు ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలకు భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి సుమారు రెండు అక్షల మంది హనుమాన్ దీక్షాదారులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. భక్తులు రద్ధీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అధికారులు పోలీసు బందోబస్తు ఏర్సాటు చేశారు. భక్తులకు తాగునీటి వసతి కల్పించారు.