కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో వినాయక నగర్ లో ఘనంగా విగ్రహ, ధ్వజ స్థంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

 

 

 

 

 

కొండమల్లేపల్లి డిసెంబర్ 14 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో బుధవారం నాడు వినాయక నగర్ లో శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతి దేవి ఆలయంలో యంత్ర ప్రతిష్టలు, శ్రీ మహాలక్ష్మి గణపతి సరస్వతి దేవి ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా చేపట్టిన విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినాయకుని అనుగ్రహం పొందాలని మరియు దైవచింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎంపీపీ దంపతులకు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్. వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రావుల సత్యనారాయణ, మాడుగుల యాదగిరి, తోటపల్లి శ్రీను,పాక లక్ష్మయ్య, ముడిగే శేఖర్,మల్లయ్య, కొర్ర లక్ష్మణ్,పూజారులు పాల గణపతి శర్మ, జయప్రకాష్ శర్మ, సదాశివశర్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.