కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బి.ఆర్.ఎస్.ఎస్
మోత్కూరు సెప్టెంబర్ 27 జనంసాక్షి :
స్వాత్రంత్ర సమరయోధులు,బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి (బి.ఆర్.ఎస్.ఎస్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు లక్ష్మణ్ బాపూజీ 107వ,జయంతి సందర్భంగా బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో మోత్కూరులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ లక్ష్మణ్ బాపూజీ పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించారన్నారు1969 సం.. లో స్వరాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిన గొప్ప వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి పట్టణ అధ్యక్షుడు నిలిగొండ మత్స్య గిరి, నాయకులు సంద సోమన్న, కట్ట రామలింగం, మహేష్, లింగుస్వామి తదితరులు పాల్గొన్నారు.