కొందరి స్వార్థం కోసం స్టయ్రిక్‌ చేస్తారా

ఎవరు అడ్డు వచ్చినా షూటింగ్స్‌ ఆపేది లేదు
తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌

తెలుగు ఫిల్మ్‌ ఇండస్టీ ఎదుర్కొంటున్న సమస్యలు, ఆగస్టు 1 నుంచి జరగనున్న స్టయ్రిక్‌పై తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ స్పందించారు. శనివారం తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ విూడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ’కొందరి స్వార్థం కోసం స్టయ్రిక్‌ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో యాభైకి పైగా చిన్న సినిమాల షూటింగ్స్‌ జరుగుతున్నాయి. ఎవరు అడ్డు వచ్చినా షూటింగ్స్‌ ఆపేది లేదు. నలుగురైదుగురు నిర్మాతల వల్ల షూటింగ్స్‌ ఆపడం సరైంది కాదు. అలాగే కొందరి చేతుల్లోనే థియేటర్స్‌ పెట్టుకున్నారు. వాళ్లకు ఎలా ఇష్టమైతే అలా చేయడం అస్సలు కరెక్ట్‌ కాదు. చిన్న సినిమాలకి థియేటర్స్‌ ఇవ్వరు. ఓటీటీలకు ఇవ్వొద్దు అంటున్నారు. ఆ పది మంది ప్రొడ్యూసర్లే బతకాలా?. ఇండస్టీప్రై ప్రేమ ఉంటే పర్సెంటేజ్‌ ప్రకారం థియేటర్స్‌ ఇవ్వాలి. పెద్దవి 40 వస్తే.. చిన్న సినిమాలు 200 పైన రిలీజ్‌ అవుతాయి. టికెట్స్‌ ధరలు పెంచమని చెప్పింది కూడా వీళ్ళే. వాళ్ళే సినిమా టికెట్‌ ధరలు పెంచాలని ప్రభుత్వం దగ్గరికెళ్లారు. ఈ విధానం కూడా మార్చాలి. టికేట్‌ రేటు వంద కంటే ఎక్కవ పెంచకూడదు. పాప్‌కార్న్‌ కొనాలంటే రూ.200, వాటర్‌ కొనాలంటే రూ 70. ఇవి ఎందుకు తగ్గించరు? ఒక ఫ్యామిలీ మూవీకి వెళ్లాలంటే రెండు నుంచి మూడు వేలు ఖర్చవుతోంది. ఇంత ఖర్చు చేయడానికి ఎవరు ముందుకొస్తారు? పెరిగిన ధరలకు జనాలు థియేటర్‌ లకి రాకపోతే… ఇప్పుడు షూటింగ్‌ లు ఆపాయలంటున్నారు. అది కుదరదు. స్టైక్ర్‌ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నా. ఒక్క సినిమా హిట్‌ అయితే హీరోకి వంద కోట్లు రెమ్యునరేషన్‌ ఇస్తారా? అంత ఎవరివ్వమన్నారు? ఓటీటీ విషయంలో కూడా ఆలోచించాలి. ఓటీటీకి సినిమాలు ఇవ్వొద్దనే అధికారం సో కాల్డ్‌ నిర్మాతలకు లేదు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వనప్పుడు ఓటీటీలే ఆదుకుంటున్నాయి. నేషనల్‌ అవార్డ్స్‌ వచ్చిన కలర్‌ ఫొటో, నాట్యం సినిమాలకి థియేటర్లు ఇవ్వలేదు. ’కలర్‌ ఫొటో’ ఓటీటీలోనే రిలీజయ్యింది. కాబట్టి పెద్ద సినిమా రెండు వారాలకి, చిన్న సినిమా ఒక వారానికి ఓటీటీకి రావాలి. సినిమా అనేది ప్రేక్షకులకు భారం కాకుండా చూడాలి’ అన్నారు. వైస్‌ ప్రెసిడెంట్‌ గురురాజ్‌ మాట్లాడుతూ ’కొందరు సినిమా ఇండస్టీన్రి శాసించే స్థాయి కి వెళ్ళారు. ఇప్పుడున్న పెద్ద నిర్మాతలు ఒకప్పుడు చిన్నవాళ్లు కాదా. విూ ఏకథాటి నిర్ణయాల వలన చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రేక్షకులు భయపడేలా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్స్‌ ఆపేది లేదు’ అని చెప్పారు. జనరల్‌ సెక్రెటరీ సాగర్‌, మెట్రో స్టూడియో అధినేత ఈవీఎన్‌ చారితో పాటు మరికొందరు నిర్మాతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.