కొడిమ్యాలలో దొంగనోట్ల చెలమణి

కొడిమ్యాల, టీ మీడియా: మండలంలోని నాచుపల్లి గ్రామంలో దొంగనోట్లు చలమణి జరుగుతుందని 20 రోజులుగా వినికిడి గ్రామనికి చెందిన బీడీ కంపెనీ యజమాని ఈనెల 5వ తేదిన ఇద్దరు మహిళల్లో ఒకరికి రెండు వెయ్యి రూపాయల నోట్లు, మరో మహిళకు నాలుగు వెయ్యి రూపాయల నోట్లు ఇచ్చాడు. అందులో ఒక మహిళ కొడుకు స్కూల్‌ ఫీజ్‌ కింద జగిత్యాలకు వెళ్లి పాఠశాలలో చెల్లించగా అక్కడ దొంగ నోటని తెలింది. అదే దోంగనోటుకు నాచుపల్లికి వచ్చి పరిచయస్తునికి చూపించగా ఆ నోటు అతను తీసుకుని రెండు 500ల నోట్లు ఇచ్చాడు. దీంతో పాటు గతంలో సూరంపేట గ్రామనికి చెందిన మహిళ వెస్టర్‌ యూనియన్‌లో డబ్బులు తీసుకోని బ్యాంకులో వేయగా బ్యాంకు అధికారులు అందుల్లోంచి రెండు దొంగనోట్లు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా విచరన జరుపుతున్నాట్లు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కోంటున్న వారు తమకేమీ తెలియదని పేర్కొంటున్నారు. దీనిపై పూర్తి విచారన జరిపి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.