కొడుకును హత్య చేసిన తండ్రి

ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్‌పల్లి గ్రామంలో ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేశాడు. గ్రామానికి చెందిన జానం రామయ్య కుమారుడు మల్లేష్‌ (35) గత కొన్నేళ్లుగా జులాయిగా తిరుగుతూ డబ్బులు ఇవ్వమని తల్లిదండ్రులను వేధించేవాడు. కుమారుడు పెట్టే బాధలు తట్టుకోలేక శనివారం రాత్రి గొడ్డలితో అతన్ని నరికి చంపినట్లు తండ్రి తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.