కొడుకు మరణవార్త విని తండ్రి మృతి
ఎల్లారెడ్డి,(జనంసాక్షి): నిజామాబాద్ నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామానికి చెందిన విఠల్(33) బుధవారం హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మరణవార్త స్వగ్రామంలో ఉన్న తండ్రి దుర్గయ్య (58) వినగానే ఉన్నచోటే కుప్పకూలి మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం విఠల్ మండలంలోని శివనగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు.