కొత్త హైకోర్టు ఏర్పడకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన
– ఎంపీ జితేందర్ రెడ్డి
– రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తాం
– పరిశీలనలో హైకోర్టు విభజన, ప్రత్యేక హోదా
న్యూఢిల్లీ,ఆగస్టు4(జనంసాక్షి):
రాష్ట్రం ఏర్పడినా ప్రత్యేక హైకోర్టు ఎందుకు ఏర్పడడం లేదని జితేందర్ రెడ్డి అన్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని అన్నారు. కావాలనే హైకోర్టు విభజన లో జాప్యం జరుగుతోందని ఆయన విమర్శించారు. గతంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన బిజెపి సర్కార్ ఇప్పుడు మాత్రం ఎందుకు జాప్యం చేస్తోందన్నారు. తాము న్యయం మాత్రమే కోరుతున్నామని, లోక్‌సభ కార్యకపాలాపాలు ఆపాలని చూడడం లేదన్నారు. ప్రత్యేక¬దా, హైకోర్టు విభజన, తెలుగు రాష్ట్రాల సమస్యలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. సమస్యలన్నీ కేంద్రానికి తెలుసని ప్రకటించింది. లోక్‌సభలో ఈ వ్యవహారంపై రెండు రాష్ట్రాల ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రత్యేక ¬దా కల్పించాలని వైకాపా కోరగా, హైకోర్టు విభజన చేయాలని టిఆర్‌ఎస్ పట్టుబట్టింది. దీంతో స్పందించిన కేంద్ర మంత్రులు స్పందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వమని, వారికి న్యాయం చేస్తామని కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా లోక్‌సభలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగనివ్వబోమన్నారు. కేంద్రం అన్ని విషయాలపై అవగాహనతో ఉందని, సానుకూలంగా ఉందన్నారు. హైకోర్టు విభజనపై న్యాయశాఖమంత్రితో మాట్లాడామని, దానిపై న్యాయశాఖామంత్రి కసరత్తు చేస్తున్నారని తెలిపారు. విభజన సమస్యల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేయదని కేంద్ర ¬ంశాఖమంత్రి చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలోని హావిూలను తాము నెరవేరుస్తామని, ఏపీ, తెలంగాణలను ఆదుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. హైకోర్టు విభజనపై ఇప్పటికే న్యాయమంత్రితో మాట్లాడామని రాజ్‌నాథ్ అన్నారు.ప్రత్యేక ¬దాకు డిమాండ్ చేస్తూ ఏపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ¬ంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో ప్రకటన చేశారు. అయితే ఏపీ ప్రత్యేక ¬దాపై మాట్లాడేందుకు మాత్రం రాజ్ నాథ్ తిరస్కరించారు. దాంతో ఏపీ ప్రత్యేక ¬దాపై సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్ సీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. అంతకుముందే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. హైకోర్టు విభజనపై న్యాయశాఖమంత్రితో మాట్లాడామని, దానిపై న్యాయశాఖామంత్రి కసరత్తు చేస్తున్నారని తెలిపారు. ఇక హైకోర్టు విభజనకు కట్టుబడి ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పస్టం చేశారు. రాష్ట్రం విడిపోయాక హైకోర్టు విడదీయాల్సిందేనన్నారు. దీనికి న్యాయశాఖ కసరత్తు చేస్తోందని అన్నారు. ప్రత్యేక¬దా విసయం 14వ ఆర్థిక సంఘం పరిశీలనలో ఉందన్నారు. చట్టంలో దీనిపై స్పష్టత లేకపోవడం, ఆనాడు దీనిని విభజన చట్టంలో పొందు పర్చకపోవడం వల్ల కొంత గందరగోళం ఉందన్నారు. ఇక నాలుగుసార్లుగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో కూడా తాము హైకోర్టు విభజన గురించి అడుగుతున్నా ఎందుకు జరగడం లేదని లోక్ సభలో టిఆర్‌ఎస్ నేత జితేందర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హైకోర్టు కోసం లాయర్లు ఆందోళన చేస్తున్నారని, తాము ప్రధాని,రాష్ట్రపతి వంటివారిని కలిసినా ప్రత్యేక హైకోర్టు ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు. తమ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా దీనిపై ఉత్తరాలు రాశారని అన్నారు. ఇరవైతొమ్మిది మంది జడ్జిలు హైకోర్టులో ఉంటే ఇరవైఐదు మంది ఆంద్రకు చెందినవారేనని ఆయన అన్నారు. దీనికి వెంకయ్య నాయుడు సమాధానం చెబుతూ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైకోర్టు వేరుగా ఉండవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు.అయితే ఇందులో సబ్ జ్యడిస్ అంశం ఉందని అంటున్నారని,అయినా దీనిపై మరో పారి పరిశీలన చేయాలని కోరుతున్నామని అన్నారు. హైకోర్టు విఃభజన జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. టిఆర్‌ఎస్ ఎమ్.పి వినోద్ మాట్లాడుతూ కేంద్రం తలచుకుంటే హైకోర్టు విభజన చేయవచ్చని అన్నారు. రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల చేస్తే సరిపోతుందన్నారు. చిన్న విసయాన్ని కూడా సాగదీస్తున్నారని అన్నారు. ప్రత్యేక భవనం కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఇకప్రత్యేక ¬దా ఇవ్వకుంటే ఏపీ ప్రజలు క్షమించరని ఎంపీ మేకపాటి అన్నారు. లోక్‌సభలో ప్రత్యేక ¬దా అంశాన్ని ఎంపీ మేకపాటి ప్రస్థావించారు. ఏపీకి ఎందుకు ప్రత్యేక ¬దా ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఏపీని ప్రత్యేకంగా చూడాలని ఆయన కోరారు. ఇదిలావుంటే కేంద్రంలో తమకు రెండు మంత్రి పదవులు ముఖ్యం కాదని , ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ¬దా ముఖ్యమని టిడిపి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ విభజనలో ఎపికి నష్టం వాటిల్లిందని అన్నారు. లోటు బడ్జెట్ , కొత్త రాజధాని నిర్మాణం వంటివి చేయవలసి ఉందని అన్నారు. ప్రత్యేక ¬దా ఇస్తామని పార్లమెంటులో ప్రకటించారని, దానిని బిజెపి ఎన్నికల ప్రణాళికలో పెట్టిందని ఆయన గుర్తు చేశారు. ఎపి ప్రజలంతా దీనిపై ఎంతో ఆశ పెట్టుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రత్యేక ¬దాపై ప్రజలలో అలజడి గా ఉందని అన్నారు. అంతకుముందు వీరు ప్లకార్డులతో స్పీకర్ పోడియం ముందు ఆందోలనకు దిగారు.