కొనసాగుతున్న ఇయు దీక్షలు
కందుకూరు , జూలై 23 : ఆర్టీసి ఇయు రీజనల్ సెక్రటరీ విజయారావు మరో ఇద్దరు యూనియన్ నాయకులపై యాజమాన్యం అక్రమంగా విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా స్థానిక ఇయు ఆధ్వర్యంలో డిపో ఆవరణంలో కొనసాగుతున్న దీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక డిపోకు చెందిన డ్రైవర్లు ఆర్‌కె వాసన్, యు శ్రీనివాసరావులు దీక్షలు కూర్చోగా ఇయు స్థానిక డిపో కార్యదర్శి పి రామ్మూర్తి దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం ఉద్యమిస్తున్న ఇయుపై యాజమాన్యం కక్షసాధింపు చర్యలు చేపడుతుందని అన్నారు. కొంతమంది ఎన్‌ఎంయు నాయకులు, యాజమాన్యం కుమ్మక్కై విజయారావు, యూనియన్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయం అని ఆయన అన్నారు. విజయారావు యూనియన్ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులు, అక్రమ సస్పెన్షన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేని యడల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రంలో ఇయు నాయకులు మాధవరావు, జివి రావు, శివయ్య, బాబురావు, ఆదినారాయణ, ఆచారిలు, ప్రసాద్, కార్మికులు పాల్గొన్నారు.