కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
విశాఖపట్నం,సెప్టెంబర్5(జనం సాక్షి): దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర బంగాళాఖాతం పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్నదని పేర్కొంది. రుతుపవనాలు బలహీనంగా వుండడంతో మంగళవారం కోస్తాలోని పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. నెల్లూరులో 38.5, కావలిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా మరికొన్నిచోట్ల స్థానిక వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వర్షాలు కురిశాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.