కొనసాగుతున్న రిమ్స్‌ ఉద్యోగుల సమ్మె

ఆదిలాబాద్‌, జనవరి 28 (): పెండింగ్‌ వేతనాల కోసం గత 19 రోజులుగా రిమ్స్‌ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె చేపట్టినా అధికారుల్లో చలనం లేదని ఆ సంఘం అధ్యక్షుడు సంతోష్‌ విమర్శించారు. రిమ్స్‌ కళాశాలలో ఉద్యోగులు, సిబ్బంది తమకు రావాల్సిన వేతనాల కోసం విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నా పరిష్కరించేందుకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పూర్తిస్థాయిలో పెండింగ్‌ వేతనాలు చెల్లించేవరకు సమ్మె విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ తమ సమస్య పట్ల స్పందించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్‌ జోక్యం చేసుకొని తమ వేతనాలను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.