కొనసాగుతోన్న అల్పపీడన ద్రోణి-ఉపరితల ఆవర్తనం
హైదరాబాద్:అల్పపీడన డ్రోణి, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా రానున్న 24 గంటల్లో తెలుగురాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. ప్రత్యేకించి ఉత్తరకోస్తాలో చాలాచోట్ల వానలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. దక్షిణకోస్తా, రాయలసీమ, తెలంగాణలోనూ కొన్నిచోట్ల జల్లులు కురుస్తాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో కొయ్యలగూడెంలో 7సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అమలాపురం, తిరువూరు, విజయనగరంలో 6సెం.మీ.వర్షపాతం నమోదు అయింది.




