కొనుగోలు కేంద్రాల్లోనే పంటలు అమ్ముకోవాలి
గిట్టుబాటు ధరలు ఇస్తున్నది ఇక్కడే: ఎమ్మెల్యే
కరీంనగర్,నవంబరు 25 (జనంసాక్షి) : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. రైతులకు సకాలంలో సరైన ధరలు లభించేలా చర్యలు తీసుకున్నారని, ఇందుకు సిఎం కెసిఆర్ అభినందనీయుడని అన్నారు. ఇతర రాష్టాల్రతో పోలిస్తే తెలంగాణలో మాత్రమే గిట్టుబాటు ధరలు దక్కేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయిస్తే త్వరితగతిన బ్యాంకు ఖాతాలో డబ్బులను జమ చేస్తున్నామన్నారు. రైతులు ఆరుగాలం పండించిన పంటలను దళారుల చేతుల్లో పెట్టి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కోనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే సూచించారు.దళారుల బెడద లేకుండా గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు అనుబంధ సంస్థల ఏర్పాటు ఆలోచన చేస్తుందన్నారు. త్వరలోనే అది కార్యరూపం దాల్చనుందని అన్నారు. వీటి ఏర్పాటు ద్వారా రైతులు తమ ధాన్యం ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉంటుం దని తెలిపారు. ప్రాజెక్టులతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిన దృష్ట్యా పండించిన పంటలు ప్రకృతి విపత్తుల బారిన పడకుండా ఉండడం కోసం నవంబరు, మార్చి నెలల్లోనే పంటలకు నీటిని విడుదల చేసి ముందుగా పంటల సాగు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దీని ద్వారా వర్షాలు పడకపోయినా ఎల్లంపెల్లి, మేడిగడ్డ, అన్నారం,సుందిల్ల ప్రాజెక్టుల నీటిని విడుదల చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఆయా సీజన్‌లో సంభవించే ప్రకృతి విపత్తుల బారిన పడకుండా, రాళ్ల వర్షాల నుంచి పంటలను కాపాడు కోవచ్చునన్నారు.నీటిని లిప్ట్ చేయడంపై అనుమానాలను పటపంచాలు చేస్తూ గోదావరి నీరు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ,ఖమ్మం జిల్లాలకు తరలుతున్నాయని తెలిపారు.