కొమురవెల్లిలో పారిశుద్యానికి పెద్దపీట
సిద్దిపేట,నవంబర్27 (జనంసాక్షి ) : కొమురవెల్లిలో జరిగే బ్ర¬్మత్సవాల్లో పారిశుద్ద్యానికి పెద్దపీట వేయనున్నారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని నిర్ణయించారు. పారిశుద్ధ్య కార్మికులను కేటాయించి, వారిపై పర్యవేక్షణ ఉంచాలి. ఎక్కడైనా లోటుపాట్లు కన్పిస్తే బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులు పెద్దసంఖ్యలో రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తవచ్చునని.. ఇందుకుగాను ఆలయ పరిసరాల చుట్టూ పక్కాగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు శుద్ధజలాలను అందించడానికి ప్రత్యేకంగా కుళాయిలు అందుబాటులోకి తీసుకుని రానున్నారు. మూడు నెలల పాటు సాగే బ్ర¬్మత్సవాల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. ఏటా కల్యాణోత్సవం తరువాత బ్ర¬్మత్సవాలు జరుగుతుంటాయి. పట్నంవారంతో ఉత్సవాలు ప్రారంభమై.. అగ్నిగుండాలతో ముగుస్తాయి. ఇందులో భాగంగా మహాశివరాత్రి రోజున పెద్దపట్నం కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించనున్నారు. భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో ఏమాత్రం లోటు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయానికి వచ్చే రోడ్లు అధ్వానంగా ఉన్నాయని… వ మరమ్మతులు చేయించాలని సూచించారు.