కొలంబో వన్డే : భారత్ బ్యాటింగ్
కొలంబో: భారత్-శ్రీలంక మధ్య మరికొద్దిసేపట్లో నాలుగో వన్డే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ వన్డేలో మూడు మార్పులతో కోహ్లీసేన బరిలోకి దిగుతోంది. చాహల్, కేదార్ జాదవ్, భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్, మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-0తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ధోనీకి కోహ్లీ జ్ఞాపిక
అంతకుముందు కెరీర్‌లో 300వ వన్డే ఆడుతోన్న మహేంద్ర సింగ్ ధోనీకి భారత క్రికెట్ జట్టు సారథి కోహ్లీ ప్రత్యేక జ్ఞాపిక అందజేశాడు. వన్డేల్లో అరంగేట్రం చేస్తున్న శార్దూల్ ఠాకూర్‌కి కోచ్ రవిశాస్త్రి వన్డే క్యాప్‌ని అందించాడు.