కొలువుదీరిన దుర్గామాత.

దుర్గామాత.
బెల్లంపల్లి, సెప్టెంబర్26,(జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించారు. భక్తి శ్రద్ధలతో దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. దసరా నవరాత్రుల్లో వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి నిష్ఠతో ప్రత్యేక పూజలు చేయనున్నారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పసిడి పంటల, సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు.