‘కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి’
హైదరాబాద్: సచివాలయంలో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ను విద్యార్థి సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ల పేరుతో ఎలాంటి వసతులు కల్పించకుండా వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి నేతలు మంత్రికి విజ్ఞప్తి చేశారు.