కోడేరు తహసిల్దార్ కార్యాలయానికి తాళం వేసి, 2 గంటల సేపు రెవెన్యూ సిబ్బందిని దిగ్బంధించిన వీఆర్ఏలు.
కోడేరు (జనంసాక్షి) అక్టోబర్ 10 కోడేరు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో వీఆర్ఏలు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని నేటికీ 78వ రోజు వరకు రిలే నిరాహార దీక్ష చేస్తున్న వీఆర్ఏలు నేటికీ తమ డిమాండ్లను పరిష్కరించనందుకు నిరసనగా రెవెన్యూ అధికారులను కార్యాలయాలకు వెళ్లకుండా సోమవారం కొంతసేపు అడ్డుకున్నారు. కోడేరు మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర సోమవారం రోజు తహసిల్దార్ తో పాటు వారి సిబ్బందిని కార్యాలయంలోకి వెళ్లకుండా కొంతసేపు అడ్డుకోవడం జరిగింది. అని వీఆర్ఏలు తెలిపారు. ఇప్పటికైనా వీఆర్ఏల డిమాండ్లు తమకు పే స్కేలు, జీ ఒ అమలు చేయాలని,ఏ అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల కుటుంబాల వారసులకు ఉద్యోగ భద్రత కల్పించాలని వీఆర్ఏలు నినాదాలు చేస్తూ తమ సమస్యలనులను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. వీఆర్ఏల నాయకులు ఈ కార్యక్రమంలో జిలాని, కృష్ణ, లతోపాటు అన్ని గ్రామాల నుంచి వీఆర్ఏలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.