కోదండ రామయ్యకు 19 లక్షల 75 వేల ఆదాయం
లింగాలఘణపురం,జూన్ 18(జనంసాక్షి):
మండలంలోని నవాబుపేట గ్రామంలో శ్రీ కోదండరామ స్వామి దేవస్థానానికి వేలం ద్వారా 19 లక్షల 75 వేల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో శేషు భారతి తెలిపారు.దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే సంతలో డక్క( లారీ గడ్డ) మరియు పగ్గాల వేలం దేవస్థానం ప్రాంగణంలో శనివారం నిర్వహించినట్లు తెలిపారు. డక్క వేల నిర్వహించగా మండలంలోని వడ్డీ చర్ల గ్రామానికి చెందిన రేగు సురేందర్ 16 లక్షల 62 వేల రూపాయల పాట పాడి వేలం దక్కించుకున్నట్లు తెలిపారు. మరియు పగ్గాలు అమ్మకం నిర్వహించగా మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన వంగ రాములు 3లక్షల 12 వేల రూపాయల పాట పాడి వేలం దక్కించుకున్నారని అన్నారు. గత సంవత్సరం కంటే వేలం ద్వారా ఈసారి ఏడు లక్షల యాభై వేల రూపాయలు అదనంగా వచ్చినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం వర్కింగ్ ప్రెసిడెంట్ తీగల శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ బూడిద జయ, ఎంపీటీసీ తీగల సిద్దు, డైరెక్టర్లు శ్రీశైలం,వెంకన్న, వడిచర్ల సర్పంచ్ కడారి కృష్ణ, ఆలయ సిబ్బంది మోహన్, వెంకన్న,నాయకులు బూడిద రాజేశ్వర్,కోతి రాజు,గండి యాదగిరి, చింతల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.