*కోదాడ – మిర్యాలగూడ హైవే నిర్మాణం వివాదాస్పదం*

బలిసినోడికి కో న్యాయం పేదలకు ఓ న్యాయమా?*
*ఇష్టానుసారంగా హై వే కొలతలు వేస్తూ ఆగం పట్టిస్తున్న కాంట్రాక్టర్*
*చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం*
నేరేడుచర్ల జనంసాక్షి న్యూస్. మున్సిపాలిటీ పరిధిలో కోదాడ- మిర్యాలగూడ 167వ,నేషనల్ హైవే  నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు పక్షపాతం వహిస్తూ సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని
హిందూ ధర్మ పరిరక్షనా సమితి అధ్యక్షులు పాల్వాయి రమేష్
ఆరోపిచారు.
గురువారం నేరేడుచర్ల మండల కేంద్రంలో కాంట్రాక్టర్ల
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై వివిధ రాజకీయ పక్షాలతో కలిసి హైవే పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రోడ్డు పక్కనే ఉన్న బడా వ్యాపారులకు సహకరిస్తూ చిన్న మధ్య తరగతి యజమానులపై  హైవే నిర్మాణ అధికారులు పక్షపాతం చూపిస్తున్నారని మండిపడ్డారు.
కాంట్రాక్టర్లు బడా యజమానులకు అనుకూలంగా కొలతల విషయంలో సానుకూలంగా సహకరిస్తూ, పేదవారిని పక్కకు తోసి ధనవంతులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.ఒక చోట 69,71 అడుగులు, మరోచోట 72,74 అడుగుల కొలత కొలుస్తున్నారని అన్నారు.ప్రధాన రహదారిపై ప్రసిద్ధిగాంచిన పురాతన హనుమాన్ విగ్రహం తీసే అంతవరకు కాంట్రాక్టర్ ఊరుకోలేదని హనుమాన్ భక్తులు వాపోతున్నారు.
మరి ఇక్కడ ఎక్కువ కొలత ఎందుకు పెట్టారని  ప్రశ్నించారు.69 ఫీట్లు కొలత పెట్టి రేపు హనుమాన్ విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ట చేస్తామని,ధనికుల దగ్గర 69 అడుగులు ఉండగా తప్పు లేనిది హనుమాన్ విగ్రహం వద్ద 69 అడుగులు ఉంటే తప్పేంటని నిలదీశారు.ఈ కార్యక్రమం లో సామాజిక కార్యకర్త బెల్లంకొండ శేఖర్ హిందూ పరిరక్షణ కమిటీ సభ్యులు సురేష్ ,భాస్కర్ ,శ్రీరాములు ,మధు ,ప్రశాంతు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు