కోమురంభీమ్ పోరాట స్పూర్తే నేటి తరానికి ఆదర్శం

మహాదేవపూర్. అక్టోబర్13 ( జనంసాక్షి )
జల్ జమిన్ జంగల్ ఆదివాసుల హాక్కుల కోసం పోరాటం చేసిన కోమురంభీమ్ పోరాటం తో ఆదివాసుల గుర్తింపు తెచ్చిందని జిల్లా తుడుం దెబ్బ అధ్యక్షుడు మడే కుమార్ అన్నారు. గురువారం నాడు కోమురంభీమ్ 82 వ వర్దంతి ని మహాదేవపూర్ మండల కేంద్రంలో  ఘనంగా నిర్వహించారు.మహాదేవపూర్ లోని కోమురంభీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.మహనీయులు కోమురంభీమ్ కకళలు కన్నా ఆదివాసుల హక్కులు నేటికి అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు.ఆదివాసుల పోరాటం తోనే ఎ టి డబ్ల్యు ఓ కార్యాలయం మహాదేవపూర్ లో ఏర్పాటు చేశారని ఆయన అన్నారు.40 సంవత్సరాలు గా పోడు చేసుకుంటున్న ఆదివాసుల పోడు భూముల సర్వేలో ఆడివాసులందరికి పోడు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారుమహాదేవపూర్ పలిమేల మహముత్తారం.మండలాల్లో పోడు భూముల సర్వే లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. పోడు సాగు చేసిన వారికి ఎలాంటి కొర్రీలు పెట్టకుండా పోడు హక్కు పత్రాలు అందజేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమానికి జిల్లా అసిస్టెంట్ ట్రైబల్ వెళ్ఫెర్ అధికారి గుగులోత్ దేశిరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన. మాట్లాడుతూ మహాదేవపూర్ కు అసిస్టెంట్ ట్రైబల్ వెళ్ఫెర్ కార్యాలయం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కోమురంభీమ్ విగ్రహానికి దేశిరామ్ తో పాటు సర్పంచ్ శ్రీపతి బాపు, ఎంపీపీ రాణీ రామారావు, జడ్పీటీసీ గుడాల అరుణా శ్రీనివాస్,తహశీల్దార్ పిప్పిరి శ్రీనివాస్, ఎంపీడీఓ శంకర్ నాయక్, సింగిల్ విండో చైర్మన్  చల్ల తిరుపతి రెడ్డి,ఎంపీటీసీ దుర్గయ్య.జి సీసీ మేనేజర్ హరిలాల్,మార్కెట్ కమిటీ చైర్మన్ మమత.తుడుండెబ్బ జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు సత్యం.తుడుండెబ్బ మండల అధ్యక్షుడు కాల్ నేని రాములు.ఆదివాసీ నాయకులు కుడుమేత సమ్మయ్య, ముకునూర్ సర్పంచ్ అలం సత్యం,వార్డెన్ ఆశయాజాబినా. ఆదివాసీ సంఘాల నాయకులు. యువకులు తదితరులు పాల్గొన్నారు
Attachments area