కోర్టుకు చేరుకున్న దాల్మియా నిందితులు
హైదరాబాద్,(జనంసాక్షి): దాల్మియా ఛార్టీషీట్‌లోని నిందితులంతా కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాల మేరకు జగన్ అక్రమాస్తుల కేసులు నిందితులంతా నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలు అధికారులు అత్యంత బందోబస్తు మధ్య కోర్టుకు తీసుకువచ్చాడు. ఇదే కేసులో రెండో నిందితుడు విజయసాయిరెడ్డి కూడా చంచల్‌గూడ అధికారులు కోర్టుకు తీసుకు వచ్చారు. నాలుగో నిందితురాలిగా ఉన్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడు కార్తీక్‌రెడ్డితో కలిసి నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. ఇంకా ఈ కేసులో నిందితులంతా కూడా ఈ కేసులో నిందితులంతా కూడా కోర్టుకు చేరుకున్నట్టు సమాచారం.