కోర్టుకు హాజరుకాని అక్బరుద్దీన్‌

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు

నిర్మల్‌ టౌన్‌, న్యూస్‌టుడే: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ మంగళవారం నాటి విచారణకు హాజరుకాలేదు. గతంలో జరిగిన విచారణ మేరకు మంగళవారం అయన నిర్మల్‌ న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉంది. అయితే కేసు పై పోలీసులు ఇంకా ఛార్జిషీట్‌ దాఖలు చేయకపోవడం, అక్బరుద్దీన్‌ అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని న్యాయస్థానంలో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని నిందితుడి తరవు న్యాయవాదులు న్యాయ స్థానంలో పిటీషన్‌ దాఖలు చేశారు. దీనికి న్యాయ స్థానం అంగీకరించడంతో అక్బరుద్దీన్‌ మంగళవారం నిర్మల్‌ న్యాయ స్థానానికి హాజరు కాలేదు.