కోర్టు పరిధిలో హైకోర్టు విభజన
– న్యాయ విద్య ప్రమాణాలు మెరుగుపర్చాలి
– లా కమిషన్, భారత బార్ కౌన్సిల్ చొరవ చూపాలి
– నల్సార్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం
– విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేసిన కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ
శామీర్‌పేట, రంగారెడ్డి ఆగష్టు 16 (జనంసాక్షి):
ఉమ్మడి హైకోర్టు విభజన అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం తానేమీ మాట్లాడబోనని కేంద్ర న్యాయశాఖమంత్రి సదానంద్ణొడ అన్నారు. నల్సార్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రపట్టాలను ప్రదానం చేయడానికి వచ్చిన సదానంద్ణొడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కావాలని తెరాస ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావించారని తెలిపారు. వారి డిమాండ్ సహేతుకమైనదేనని చెప్పారు. హైకోర్టును విభజించాలని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పరిశీలిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్గానికి ప్రత్యేక ¬దా అంశంపై కేంద్రం కట్టుబడి ఉందని సదానంద్ణొడ స్పష్టం చేశారు. అంతకు ముందు జరిగిన కార్యక్రమంలో, దేశంలో న్యాయవిద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి లా కమిషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చొరవ చూపడంతో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం వంటి జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు అవతరించాయని కేంద్ర న్యాయ శాఖామంత్రి డీ.వి. సదానంద్ణొడ తెలిపారు. ఆదివారం శామీర్‌పేట మండలకేంద్రంలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన 13వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత రెండు దశాబ్దాలుగా జాతీయ విశ్వవిద్యాలయాలు చేస్తున్న కృషి ఫలితంగా న్యాయ శాస్త్ర విద్యార్థులకు ఐఐటీ, ఐఐఎమ్ విద్యార్థులతో సమాన గుర్తింపు లభించిందన్నారు. దేశంలోని న్యాయ కళాశాలల పరిస్థితి ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా 575 మంది విద్యార్థులకు న్యాయ పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బాబాసాహెబ్ భోస్లే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్.ఎస్.ఎమ్. ఖాద్రి, ఎంపీ వినోద్‌కుమార్, నల్సార్ వైస్‌ఛాన్సలర్ ఫైజాన్ ముస్తాఫా, రిజిస్గార్ డి.బాలకిష్టారెడ్డి, న్యాయమూర్తులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.