కోలిండియాక్రికెట్‌ఏర్పాట్ల పరిశీలన
రామకృష్ణాపూర్, న్యూస్‌టుడే:రామకృష్ణాపూర్ పట్టణంలోని ఠాగూర్ మైదానంలో కోలిండియా క్రికెట్ పోటీల కోసం
చేపట్టిన ఏర్పాట్లను ఆదివారం క్రీడాసంఘాల నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి పి.రఘనాథ్‌రెడ్డి, బాడీ బిల్డింగ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదర్శన్ గౌడ్‌లు మాట్లాడారు. పదేళ్లుగా మైదానంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని కోలిండియా పోటీలతో యాజన్యం క్రీడాకారులకు అందివచ్చేలా ఏర్పాటు చేయడం హర్షనీయమని పేర్కొన్నారు. ఆర్కెపీ ఓసీపీ ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఠాగూర్ స్టేడియం చుట్టూ ప్రహారీ, మైదానం అభివృద్ధి, పార్కు, ఈతకొతను ఏర్పాటుకు యాజమాన్యం హామీ ఇచ్చిందని వీటి ఏర్పాటుకు జీఎం చొరవచూపాలని కోరారు. కోలిండియా పోటీల విజయవంతానికి తమ కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతనాల బోర్డు మాజీ డైరెక్టరు నీలం శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ నాయకులు పల్లె రాజు, కాసర్ల ప్రకాశ్, సంగి రమేష్, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.