కోవిడ్ వాక్సినేషన్ లో భారతదేశం నెంబర్ వన్ గా ఉంది
కేంద్రమంత్రి దేవసింగ్ చౌహన్
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని కేంద్ర సహాయ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దేవ్ సిన్హ్ చౌహన్ అన్నారు.
ఆదివారం నాడు బీబీనగర్ ఎయిమ్స్ లోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎయిమ్స్ 2019లో ప్రారంభమై అభివృద్ధి చెందుతున్నదని, కావాల్సిన సిబ్బంది, మౌళిక సదుపాయాలను కల్పించడం జరుగుతున్నదని అన్నారు. ప్రజలందరూ ఎయిమ్స్ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. ఎయిమ్స్ దక్షిణ భారతదేశం లోనే అగ్రగామిగా నిలుస్తుందని, ప్రజల సహకారంతో ఇది సాకారం అవుతుందని అన్నారు.
అనంతరం ఎయిమ్స్ ఆవరణలో కేంద్ర మంత్రి మొక్కలు నాటారు.
కార్యక్రమంలో ఎయిమ్స్ ప్రొఫెసర్లు నితిన్ అశోక్ జైన్, నీరజ్ అగర్వాల్, అనంతరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.