కోహ్లీ ‘బాకీ’ చెల్లిస్తాడని భయం: గిల్లీ
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ టీమిండియా కెప్టెన్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ బ్యాటింగ్ విషయంలో తనకు భయంగా ఉందని చెప్పాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ ఇప్పటి వరకూ తన పరుగుల వరదను పారించలేదని, చాలా బాకీ ఉన్నడని చెప్పాడు. అయితే ఆఖరి టెస్ట్‌లో చెలరేగుతాడేమోనని తనకు భయంగా ఉందని వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఒక గొప్ప నాయకుడని, జట్టును దేశాన్ని తనతో పాటు నడిపించగల సమర్ధుడని చెప్పాడు గిల్‌క్రిస్ట్. భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ విజేతను తేల్చే ఆఖరి టెస్ట్ మ్యాచ్ శనివారం నుంచి ధర్మశాలలో మొదలుకానుంది.