కౌడిపల్లి వద్ద రెండు కార్లు ఢీ.. చిన్నారి సహా దంపతులు మృతి

మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం వెంకట్రావ్‌పేట గేటు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఆల్టో కారు ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న ఆల్టో కారును మరో కారు ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాద ధాటికి ఆల్టోకారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులను ఎండీ గౌస్, అలీ, అజీమ్ బేగంగా గుర్తించారు. ఈప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు కాగా చికిత్స కోసం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజావార్తలు