కౌలు రైతులను ఆదుకోవాలి

ఏలూరు,జూన్‌15(జ‌నం సాక్షి ): కౌలు రైతులకు రుణార్హత కార్డులివ్వాలని, ఈ-కార్డు ద్వారా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం వడ్డీలేని పంట రుణం రూ.లక్ష చొప్పున ఇవ్వాలని, ప్రభుత్వం వాగ్దానం మేరకు రుణ మాఫీ చేయాలని ఎపి కౌలు రైతు సంఘం కోరింది. ఆత్మహత్య చేసుకున్న రైతాంగ కుటుంబీకులకు 13 సర్టిపికేట్లతో సంబంధం లేకుండా ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌ఫుట్‌సబ్సి డీలు, ప్రకృతి నష్ట పరిహారాలు, వ్యవసాయ ఉపకర ణాలు కౌలు రైతులకు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నార న్నారు. పంటల భీమా పథకం కింద కౌలు రైతులు చెల్లించే బీమా ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని అన్నారు. పంట లకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, ఎన్నికల వాగ్దానం మేరకు ధరల స్థిరీకరణకు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వకుండా చట్టానికి విరుద్ధంగా భూ యజమానులకు ఇవ్వడం అన్యాయమన్నారు. కౌలు రైతులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆందోళనలు జరుగుతున్నాయని కోరారు.