క్యాన్వాసింగ్‌ దళారుల దందా

-తూకాల్లో మోసంక్ష
-మిల్లర్లకు ఝలక్‌
-వాహనానికి రూ. 20 వేల చొప్పున బాదుడు
-రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన బ్రోకర్‌
-చీటింగ్‌ పై పట్టణ సీఐ సీరియస్‌
జమ్మికుంట, టీ మీడియా : జమ్మికుంట క్యాన్వాసింగ్‌ దళారుల దందాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ధాన్యం తూకాల్లో మోసం చేస్తూ వాహనానికి ఒక్కంటికి రూ. 20వేల కు పైగా దండుకున్నా వైనం గురువారం వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఓ మిల్లర్‌ రెడ్‌ హ్యాండుగా పట్టుకున్నారు. వేబ్రిడ్జి నిర్వాహకులు , క్యాన్వాసింగ్‌ ఏజెంట్లు దోపీడి దందా గురువారం పట్టణ ఠాణ మెట్లెక్కింది. ఈ చీటింగ్‌ కేసుల నమోదు పై దాసరి భూమయ్య దృష్టిసారించినట్లు సమాచారం.
ఇదీ జరిగేది…
పట్టణంలో పదికిపైగా క్యాన్వాసింగ్‌ కార్యలయాలున్నాయి. మార్కెటు అనుమతులేక అంతా జీరొదందా నడుస్తోంది. రైతుల వద్ద అతి తక్కువ ధరకు కొని , తుకాల్లో మోసాలు చేస్తు అమ్ముకునే వ్యాపారం వీరిది. అలా కోట్లు గడించారు.అదుపు చేయాల్సిన అధికారులు, అలా షో రైడింగ్‌ చేసి మామూలుగా వెల్తారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
ఇలా జరుగుతోంది
బ్రోకర్లు ధాన్యాన్ని రైతుల వద్ద కొని నేరుగా మిల్లర్లకు అమ్ముతున్నారు. క్వింటాలుకు రూ. 3 కమీషన్‌ పొందుతున్నారు.. అంతే కాకుండా వేబ్రిడ్జి నిర్వాహకులు కుమ్మకుయారు వాహనానికి రూ 500లు ఇచ్చి క్వింటాళ్లు సెట్‌ చేస్తూ తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. లక్షలు దండుకుంటున్నారు. మండలంలోని కొత్తపల్లికి చెందిన దళారీ సత్యానారయణ రెండు రోజుల క్రితం అబాది జమ్మికుంట బాయిల్డు మిల్లర్‌కు 60 బస్తాల భర్తీ గల వరి ధాన్యాన్ని అమ్మాడు 60 బస్తాల 42 క్వింటాళ వరకు అటో ఇటో తేడా ఉండాలి. అయితే 63 క్వింటాళ దాన్యమని వేబ్రిడ్జి రసీదుకు బ్రోకర్‌ మిల్లర్‌రు అందచేశాడు.మిల్లర్‌ కాశీ అవాక్కాయ్యాడు.20 క్వింటాళ్ల తూకం మోసంపై నిలదీశాడు.దళారీ ట్రాక్టర్‌ ,పేమెంట్‌ అంతా ఆపేశాడు.ఇక సదరు బ్రోకర్‌ పట్టణంలోని మరి కొందరు మిల్లర్లకు ఇదే చీటింగ్‌ చేశాడని ఒక్కొక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి.గడిచిన రెండెళ్లలో కోట్లకు పైగా మిల్లర్లను ముంచినట్టు,దళారీ డబ్బులను మిల్లర్లు ఇవ్వడంలేదని తెలిసింది.