క్రికెట్ టోర్నీ ప్రారంభం.
టోర్నీ ప్రారంభిస్తున్న జడ్పీ వైస్ చైర్మన్.
బెల్లంపల్లి, అక్టోబర్1, (జనంసాక్షి)
బెల్లంపల్లి మండలం బుదాఖుర్డ్ గ్రామంలో శనివారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను మంచిర్యాల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రగతిలో యువత పాత్ర చాలా ముఖ్యమని, చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా సన్మార్గంలో పయనిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. క్రీడలు శారీరక దారుడ్యం పెంచి, మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాయని అన్నారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి వైస్ ఎంపీపీ రాణి-సురేష్, ఎస్సై రాజశేఖర్, యువ నాయకులు బత్తుల రవి, ముత్తె మహేష్, ముత్తె అభినయ్,జయరాం, బోడకుంట రాజేశం, పురంశెట్టి రాజేశం, ముత్తె మురళి, బియ్యల బానేశ్ పాల్గొన్నారు.