క్రీడలకు మతం రంగు పులమడం సరికాదు
– క్రికెటర్ హర్భజన్ సింగ్
ముంబయి,అక్టోబర్24(జనంసాక్షి): న్యూజిలాండ్తో టీ20, శ్రీలంకతో టెస్టు సిరీస్లకు బీసీసీఐ సోమవారం జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో ఇద్దరు యువ ఆటగాళ్లుకు అవకాశం దక్కింది. వారే హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిరాజ్, ముంబయికి చెందిన శ్రేయస్ అయ్యర్. వీరిలో సిరాజ్ ముస్లిం. బీసీసీఐ జట్టును ప్రకటించక ముందు ఆదివారం సంజీవ్ భట్ అనే మాజీ ఐపీఎస్ అధికారి ‘ప్రస్తుత భారత జట్టులో ముస్లిం మతానికి చెందిన ఆటగాళ్లు ఎందుకు లేరు..? స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఇలా ఎన్నిసార్లు జరిగిందని ప్రశ్నించారు. ముస్లింలు క్రికెట్ ఆడకూడదని, మనసుకు నచ్చింది చేయకూడదని ఎక్కడైనా నిబంధనలు ఉన్నాయా?’ అంటూ ట్విటర్లో ప్రశ్నించారు. దీనికి భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ బదులిచ్చాడు. ‘ప్రతి క్రికెటర్ జాతీయ జట్టుకు ఆడే సమయంలో భారతీయుడిగానే భావిస్తాడు. అంతేకానీ వారికి వారి మతంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఆటగాళ్ల ఎంపిక మతం, కులాన్ని బట్టి జరగదు. జై భారత్.’ అని భజ్జీ పేర్కొన్నాడు. సంజీవ్ ప్రశ్నించిన మర్నాడే బీసీసీఐ న్యూజిలాండ్తో టీ20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో మహమ్మద్ సిరాజ్, శ్రీలంకతో టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో మహమ్మద్ షమి చోటు దక్కించుకున్నా