క్రీడల ద్వారా విద్యార్థుల్లో శారీరక దృఢత్వం,

వనపర్తి బ్యూరో సెప్టెంబర్30 (జనంసాక్షి)

వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామం
జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఎస్ జి ఎస్ జిల్లాస్థాయి కబడ్డీ టోర్నమెంట్ మరియు సెలక్షన్ అండర్ 14 బాల బాలికల పోటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ ఛైర్మెన్ ఆర్.లోక్ నాథ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, క్రీడా స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, భిన్నత్వంలో ఏకత్వం, దేశభక్తిని పెంపొందించుకోవచ్చునని ఆటలు ఆడే పిల్లలు అటు చదువులోనే కాక జీవితంలో వచ్చే అన్ని సమస్యలను చాకచక్యంతో ఎదుర్కోగలుగుతారని, కనీసం రోజు గంట సమయం ఆటలకు కేటాయించాలని విద్యార్థినిలకు తెలియజేశారు. ఇప్పుడంతా పోటితత్వం పెరిగిపోయిందని, అందివచ్చే అవకాశాలను అందుకోవడానికి ఆటలు ఎంతో తోడ్పడతాయని, ఆటలు ఉన్నత స్థాయికి ఎంతో ఉపయోగపడతాయని, గెలుపు ఓటమిలు అనేది జీవితంలో సహజమని, జీవితంలో నిరాశ నిస్పుహ ఉండకూడదని, రెండో విడత మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పెద్దగూడెం పాఠశాలలో సభా వేదిక నిర్మాణం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు.కార్యక్రమంలో సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయులు, క్రీడలో పాల్గొనే విధ్యార్థులు, తదితరులు పాల్గోన్నారు.