క్షణాల్లో ఆవిరైన ఆనందం

మల్కాజిగిరి: అంతవరకూ స్నేహితులతో సరదాగా గడిపి… ఇంటికి బయలుదేరిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిని ట్యాంకర్ రూపంలో మృత్యువు బలిగొంది. తమ బిడ్డ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు… ఆమె మరిలేదన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరవుతున్నారు.
మల్కాజిగిరి ఎస్‌ఐ రమణ్ గౌడ్ కథనం ప్రకారం.. నాగారం శ్రీనివాసనగర్‌కు చెందిన సురేష్‌కుమార్ అబిడ్స్ పోస్టాఫీస్‌లో పోస్టల్ అసిస్టెంట్ సూపరెంటెండెంట్‌గా పని చేస్తున్నారు. అతని రెండోకుమార్తె బాసంగి స్లాగ్య (20) కీసర చీర్యాలలోని గీతాంజలి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజినీరింగ్(ఐటీ) నాలుగో సంవత్సరం చదువుతోంది. సోమవారం తన స్నేహితురాలితో కలిసి ప్రాజెక్ట్ వర్క్ మెటీరియల్ కోసం సికింద్రాబాద్‌కు వెళ్లింది. సాయంత్రం తన స్నేహితురాలి యాక్టివా వాహనంపై తిరిగి ఇంటికి బయలుదేరింది. మౌలాలి ఉప్పరిగూడ క్రాసింగ్ వద్ద వెనుక నుంచి వచ్చిన జలమండలి ట్యాంకర్ వీరి వాహనాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో వాహనం వెనుక కూర్చున్న స్లాగ్య ఎడవ ు వైపు పడిపోవడంతో ట్యాంకర్ వెనుక చక్రం ఆమె తల మీదుగా వె ళ్లిపోయింది. దీంతో విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె స్నేహితురాలు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. లాలాపేటలోని క్లాస్‌మేట్స్‌తో మాట్లాడిన కొన్ని క్షణాల్లోనే స్లాగ్య మరణించిందని తెలిసి ఆమె స్నేహితులు త ట్టుకోలేకపోతున్నారు. కొద్దిసేపటి క్రితమే తమతో కలసి ఫోటో తీయించుకుందని… ఇంతలోనే తమను విడిచి వెళ్లిపోయిందని వారు విలపించారు. ఆ ఫోటోనే చివరిదవుతుందని తాము ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు.