క్షయ నివారణ దినం సందర్భంగా ర్యాలీ
కాగజ్‌నగర్: క్షయవ్యాధి నివారణ దినం సందర్భంగా కాగజ్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నుంచి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా సాగింది. క్షయవ్యాధి నివారణకు ప్రభుత్వం అందించే సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.