క్షుద్ర పూజలు అంటూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తి బైండోవర్

వేమనపల్లి,అక్టోబర్17,(జనంసాక్షి)

నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల అమాయకత్వాన్ని అవసరాలని ఆసరాగా చేసుకొని దేవుడు పూజలు మరియు క్షుద్ర పూజలు చేస్తే మంచి జరుగుతుంది, సమస్యలు తీరుతాయి, ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి అని ప్రజలను నమ్మించి మోసం చేస్తూ పూజల పేరుతో మరియు నాటువైధ్యంతో,చెట్ల మందులతో డబ్బులు వసూలు చేస్తున్నటువంటి నాయిని దుర్గయ్య,వేమనపల్లి మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి తహసీల్దార్ రాజ్ కుమార్ వద్ద బైండొవర్ చేసినట్లు చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్ ఒక ప్రకటన లో తెలిపారు. బైండోవర్ ఉల్లంఘిస్తే రెండు లక్షల రూపాయలు జరిమానా విధిస్తామన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చాలా గ్రామాల్లో ఇప్పటికీ పూజలు, మాయలు, మంత్రాలు నమ్మి మోసపోతున్నారని, మూఢనమ్మకాలతో ఏదో జరిగిపోతుందని భయాలు పెట్టుకోవద్దని, ప్రజలు మూఢ నమ్మకాలను నమ్మవద్దని,ప్రతి దానికి ఒక శాస్త్రీయ కారణం ఉంటుందని,ప్రజలు మంత్రాలను నమ్మవద్దని సూచించారు. ఆయన వెంట ఎస్సై గోపతి నరేష్ ఉన్నారు.