క్షేత్రస్థాయిలో పర్యటన చేసి క్రీడా ప్రాంగణ అభివృద్ధి చేయాలి…
క్రీడా ప్రాగణాల పరిశీలించిన అడిషనల్ డిఆర్డిఓ..
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 21
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామీణ క్రీడా ప్రాగణాలను, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి క్రీడా ప్రాగణాలను వినియోగంలోకి తీసుకురావాలని నగర్ అడిషనల్ డిఆర్డిఓ సంధ్యారాణి సిబ్బందిని ఆదేశించారు. చింతగుట్ట, ఎరడపల్లి, మక్త ,కరీంపేట్ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఈజీఎస్ పంచాయతీ కార్యదర్శులతో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డిఆర్డిఓ సంధ్యారాణి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాల లో ,గ్రామీణ క్రీడ ప్రాగణాలను, పల్లె ప్రకృతి పచ్చదనం పరిశుద్ధ కార్యక్రమాన్ని చేపట్టిందని, సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి తమవంతు కృషి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే శాఖ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇన్చార్జి ఎంపీడీవో ఖాజా బషీరో ద్దీన్, ఏపీ ఒ కే శారద, పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.